Andhrapradesh, సెప్టెంబర్ 13 -- రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు రాగా. అలాగే మరో ఏడు జిల్లాలకు ఇతర జిల్లాల ఎస్పీలను బదిలీ చేశారు. మిగిలిన 12 జిల్లాల్లో పాత వారినే ఎస్పీలుగా కొనసాగిస్తున్నారు.

మరికొంత మంది అధికారులు ఇతర జిల్లాల నుంచి బదిలీ అయ్యారు. ఏఆర్ దామోదర్ ను విజయనగరం జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా హర్షవర్థన్, చిత్తూరు జిల్లా ఎస్పీగా తుషార్ డూడి, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా సతీష్ కుమార్ బాధ్యతలు చూడనున్నారు.

కృష్ణా జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు నియమితులయ్యారు. గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్, పల్నాడు జిల్లా ఎస్పీగా డి కృష్ణారావు బాధ్యతలు చూడనున్నారు.

మరోవైపు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్...