భారతదేశం, సెప్టెంబర్ 7 -- ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నుంచి అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసింది. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా.. ఈ గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 42 ఖాళీలను రిక్రూట్ చేస్తారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేపడుతారు. జోన్ల వారీగా ఖాళీలను పేర్కొన్నారు.

ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవాలంటే లా డిగ్రీ కలిగి ఉండాలి. బార్ కౌన్సిల్ లో ఎన్ రోల్ మెంట్ తప్పనిసరి. 04.08.2025 నాటికి రాష్ట్రంలోని క్రిమినల్‌ కోర్టుల్లో కనీసం మూడేళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసిన అనుభవం ఉండాలని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. ఇక ...