భారతదేశం, ఏప్రిల్ 17 -- ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈ మేరకు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీ, శాసన మండలిలో అమోదం పొందాయి. రాష్ట్ర ప్రభుత్వ బిల్లులకు గవర్నర్‌ అమోదం తెలపడంతో వాటిని తక్షణమే అమల్లోకి తెచ్చేందుకు వీలుగా ఆర్డినెన్స్‌ జారీ చేశారు.

ఏపీలో ఎస్సీ వర్గీకరణకు అవసరమైన చట్ట సవరణ అమల్లోకి రావడంతో ఉద్యోగ నియమాక ప్రక్రియ వేగం పుంజుకోనుంది. త్వరలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే డిఎస్సీ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం జూన్‌లోపు నియామకాలను పూర్తి చేస్తామని ప్రకటించింది.

సమాజంలో వివిధ ఉప కులాల మధ్య ఏకీకృత మరియు సమానమైన పురోగతి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల మధ్య ఉప-వర్గీకరణను అమలు చేయటానికి ...