భారతదేశం, మే 12 -- ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. మే 15 నుంచి ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయుల బదిలీలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది.

ఏపీలో ఉపాధ్యాయులకు ఈ ఏడాది బదిలీల చట్టం ప్రకారం తొలిసారి నిర్వహించనున్నారు. బదిలీ చట్టాన్ని అంధులైన ఉపాధ్యాయులు హైకోర్టులో సవాలు చేశారు. వారి బదిలీలపై స్టేటస్‌కో విధించింది. ఆ పోస్టులను మినహాయించి, మిగిలిన వాటికి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది.

ఉపాధ్యాయులు బదిలీల కోసం ఆప్షన్స్‌ పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తారు. కోర్టు తీర్పుకు లోబడి ఆ తర్వాత అంధులైన ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహిస్తారు.

ఉపాధ్యాయుల బదిలీలకు మే 15 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని విద్యా శాఖ అధ...