Andhrapradesh, జూన్ 3 -- ఉద్యోగుల బదిలీల గడువుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని విభాగాల ఉద్యోగుల బదిలీలు గడువును జూన్ 9వ తేదీ వరకు వరకు పొడిగించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు జూన్ 10 నుండి ఉద్యోగుల బదిలీలపై నిషేధం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈలోపే అన్ని శాఖల్లో బదిలీల ప్రక్రియ పూర్తి కావాలని పేర్కొంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులకు, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు ఇచ్చింది.

నిజానికి ఏపీ ప్రభుత్వం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 15 నుంచి జూన్ 2వ తేదీ వరకు బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు మరో వారంపాటు పొడిగింపునకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. అప్పటి వరకు బదిలీలపై నిష...