Andhrapradesh, ఏప్రిల్ 24 -- ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ. అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ను ప్రారంభించింది. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, ఎస్సీ, ఎస్టీ డీఎస్సీ అభ్యర్థులందరికీ ఆన్ లైన్ ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ అందిచనున్నారు. ఈ సేవలను బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ..ఉచిత డీఎస్సీ కోచింగ్ కోసం శ్యామ్ ఇన్ స్టిట్యూట్ ద్వారా ఆచార్య యాప్ రూపొందించామని తెలిపారు. ఈ యాప్ ద్వారా 24 గంటల పాటు ఉచిత శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహణ ఫైల్ ప...