భారతదేశం, మే 20 -- ఏపీలో అందరికి నాణ్యమైన వైద్య సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీమా విధానంలో ఆరోగ్య శ్రీ సేవల్ని అందించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రతి కుటుంబానికి రూ.25లక్షల విలువైన ఆరోగ్య సేవల్ని ఎన్టీఆర్‌ వైద్య సేవ ద్వారా అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి.

ఏపీలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీపీఎల్‌ కుటుంబాలతో పాటు ఏపీఎల్ కుటుంబాలకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవను విస్తరించనున్నారు.

బీమా విధానంలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య సేవల్ని అందించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ తయారు చేసిన ముసాయిదాపై సాధ్యాసాధ్యాలను ఆర్ధికశాఖ అధ్యయనం చేస్తోంది.

ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఉచితంగా వైద్య సేవలు అందించేలా...