భారతదేశం, జనవరి 22 -- ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై అక్కడి ప్రభుత్వం ఇటీవలే నిషేధం విధించింది. ఇదే మాదిరి నిర్ణయం ఏపీలో కూడా అమలు కానుందా..? అక్కడ తీసుకువచ్చిన సంస్కరణలను ఇక్కడ కూడా పరిశీలిస్తున్నారా..? అనే ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. స్వయంగా ఈ విషయంపై దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవలే నిషేధం విధించిందని లోకేశ్ గుర్తు చేశారు. ఇలాంటి సంస్కరణలను ఏపీలో కూడా అమలు చేసేందుకు పరిశీలిస్తున్నామని మంత్రి లోకేశ్ చెప్పారు. దావోస్‌లో బ్లూమ్‌బర్గ్‌తో మాట్లాడిన లోకేశ్. ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఒక రాష్ట్రంగా.. మేము కూడా ఆస్ట్రేలియా తీసుకువచ్చిన చట్టాన్ని అధ్యయనం చేస్తున్నాం. ...