భారతదేశం, నవంబర్ 24 -- రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌(FBMS) ను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది ప్రతి ఇంటిని సంక్షేమ పథకాలు, ప్రజా సేవలను అందించడానికి ఒకే యూనిట్‌గా పరిగణించే సమగ్ర డేటా ఆధారిత ఫ్రేమ్‌వర్క్ అన్నమాట జూన్ 2026 నాటికి 1.4 కోట్ల స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను జారీ చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.

సచివాలయంలో ఈ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు డేటా ఇంటిగ్రేషన్‌ను పూర్తి చేసి స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను జారీ చేయాలని ఆదేశించారు. క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను ఈ మేరకు ప్రభుత్వం జారీ చేస్తుంది.

టీకాలు, ఆధార్, కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, పోషకాహార ఆహారం, స...