భారతదేశం, మే 3 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డ్ ఈ-కేవైసీ గడువును మరో రెండు నెలలు పెంచింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఏప్రిల్ 30తో రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు ముగియగా...తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ గడువును జూన్ 30, 2025 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్త రేషన్‌ కార్డుల జారీపై కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం....అనర్హుల ఏరివేత లక్ష్యంగా ఈ కేవైసీ ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందుకోసం ఏప్రిల్ 30, 2025 వరకు గడువును విధించింది. అయితే ఏప్రిల్ 30 దాటినప్పటికీ చాలా జిల్లాల్లో ఈ-కేవైసీ ప్రక్రియ ముందుకు సాగలేదు. పలు కారణాలతో ప్రజలు ఈ-కేవైసీ పూర్తి చేయడంలో జాప్యం జరిగింది.

ఇంకా రేషన్ కార్డు ఈ-కేవైసీని పూర్తి చేసుకోని వారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ-కేవైసీ గడువును జూన్ 30వ తేదీ వరకు పెం...