భారతదేశం, జనవరి 6 -- రాష్ట్రంలోని పబ్లిక్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలను ప్రపంచ స్థాయి సంస్థలుగా మార్చాలని మంత్రి నారా లోకేశ్ అన్నారు. సంస్కరణలను అమలు చేయడంలో, ఆవిష్కరణలను పెంపొందించడంలో వైస్ ఛాన్సలర్లు ముందుండాలని పిలుపునిచ్చారు. విద్యా ప్రమాణాలను పెంచడానికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని, విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిని కాపాడుతుందన్నారు.

జ్ఞాన ఆధారిత సమాజాన్ని నిర్మించడంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి లోకేశ్ నొక్కిచెప్పారు. మార్పునకు నాయకులుగా, రాయబారులుగా వ్యవహరించాలని వీసీలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను బలోపేత...