Andhrapradesh, జూన్ 13 -- ఏపీలోని ప్రఖ్యాత బెలూం గుహలకు సరికొత్త గుర్తింపు దక్కింది. భౌగోళిక వారసత్వ ప్రాధాన్యత కలిగిన ప్రదేశంగా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తింపునిచ్చింది. దేశంలోనే అత్యంత పొడవైన గుహలుగా ఇప్పటికే బెలూం గుహలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ప్రతి ఏడాది కూడా ఇక్కడికి లక్షల సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు.

భౌగోళిక వారసత్వ జాబితాలో ప్రఖ్యాత బెలూం గుహలకు గుర్తింపు దక్కడంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. కొలిమిగుండ్లలోని బెలూం గుహలకు జీఎస్ఐ ప్రత్యేక గుర్తింపునివ్వడం సంతోషమన్నారు.

"పురాతన సంస్కృతీ నిలయాలు ఈ బెలూం గుహలు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటనతో పర్యాటకంగా మరింత ప్రాచుర్యం లభిస్తుంది. జీఎస్ఐ జాబితాలో చోటు దక్కడం వల్ల బెలూం గుహలు మరింత అభివృద్ధికి నోచుకోనున్నాయి. ప్రపంచలో రెండోది, ద...