భారతదేశం, డిసెంబర్ 5 -- అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి మర్ అప్డేట్ వచ్చేసింది. డిసెంబర్ 6వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది.

ఏపీపీ రాత పరీక్షను డిసెంబర్ 14వ తేదీన నిర్వహిస్తారు. పేపర్ 1, 2 పరీక్షలు ఒకే రోజు ఉంటాయి.పేపర్‌-1 ఆబ్జెక్టివ్‌ విధానంలో 200 మార్కులకు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. ఇక అదేరోజు మధ్యా హ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు డిస్క్రిప్టివ్‌ విధానంలో 200 మార్కులకు రెండో పేపర్‌ పరీక్ష ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 118 ఖాళీలను భర్తీ చేస్తారు. మల్టీజోన్ల ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పరీక్షలను హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లోని కేంద్రాల్లో నిర్వహిస్తారు.

మొత్తం 118...