భారతదేశం, ఏప్రిల్ 22 -- ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్‌ పరీక్షలు మే 3 నుంచి ప్రారంభం కానున్నాయి. మరో పది రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రూప్ 1 అభ్యర్థులకు ‍హాల్ టిక్కెట్లు విడుదల అయ్యాయి. ఏపీపీఎస్సీ కమిషన్‌ వెబ్‌ సైట్‌లో గ్రూపు-1 హాల్ టిక్కెట్లను విడుదల చేశారు.

https://applications-psc.ap.gov.in/Download_HallTickets/

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. గ్రూపు-1 ప్రధాన పరీక్షలు రాయనున్న అభ్యర్థుల హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.రాజ బాబు పలు సూచనలు చేశారు. మొత్తం 7 పరీక్షలను ఎంపిక చేసిన 4 జిల్లాల్లో మే 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వ హించనున్నారు.

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుద...