Andhrapradesh, ఏప్రిల్ 18 -- ఉద్యోగ రాత పరీక్షలకు సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది. గత ఏడాది ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్ష తేదీలు ప్రకటించిన నేపథ్యంలో.. తాజాగా కొన్నింటి హాల్ టికెట్లను విడుదల చేసింది. ఇందులో భాగంగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (టౌన్‌ ప్లానింగ్‌) పరీక్ష హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ స‌ర్వీస్ అసిస్టెంట్ డైరెక్ట్ పోస్టుల‌కు ఏప్రిల్ 28, 29 తేదీల్లో ఎగ్జామ్స్ జరుగుతాయి. జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేప‌ర్-1) ఏప్రిల్ 28 తేదీన ఉద‌యం 9.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు జ‌రుగుతుంది.

ఇక సంబంధిత స‌బ్జెక్ట్ పేప‌ర్స్ పరీక్షలు చూస్తే.. ఏప్రిల్ 28వ తేదీన‌ మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు జ‌రుగుతుంది. అంతేకా...