భారతదేశం, మే 17 -- రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతాజిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడేఅవకాశం ఉంది. సోమవారం రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శనివారం సాయంత్రం 7 గంటల వరకు చిత్తూరు జిల్లా దామోదర మహారాజపురంలో గరిష్టంగా 49 మిల్లీ మీటర్లు, ప్రకాశం జిల్లా డీజీ పేటలో 47.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 41.3 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొనకనమిట్ల, పల్నాడు జిల్లా రావిపాడులో 40.3 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్ర...