భారతదేశం, నవంబర్ 13 -- ఏపీలో పెట్టుబుడులు క్యూ కడుతున్నాయి. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు 2025కి ముందే పలు కంపెనీలు ఏపీలో తమ పెట్టుబడుల గురించి ప్రకటిస్తున్నాయి. తాజాగా మరో సంస్థ భారీ పెట్టుబడులను ఏపీకి ప్రకటించింది. రెన్యూ ఎనర్జీ రాష్ట్రంలో రూ.82 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ సోలార్ ఇన్గోట్, వేఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో సంస్థ పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఎంవోయూ జరగనున్నట్టుగా పేర్కొన్నారు.

ఈ పెట్టుబడితో కంపెనీ నాలుగు ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తుంది. మొదటిది 6 జిగావాట్ (GW) సౌర PV ఇన్‌గాట్-వేఫర్ ప్లాంట్, రెండో 6.3 GWp హైబ్రిడ్ సైట్స్ ప్లస్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, మూడో 2 GW హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, న...