Andhrapradesh, ఏప్రిల్ 18 -- అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తు వరకు విస్తరించి... కొనసాగుతోందని వివరించింది. ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

శనివారం(ఏప్రిల్ 19) అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రెండుమూడు చోట్ల భారీవర్షాలకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం,మన్యం,విశాఖ, తూర్పుగోదావరి ,రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

రాష్ట్రంలో కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని ఏపీ వ...