భారతదేశం, నవంబర్ 14 -- ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడి రాబోతోందంటూ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిన్న చేసిన ట్వీట్‌తో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ రాష్ట్రంలో ఏకంగా 12 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.1 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిందని ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ చరిత్రాత్మక పెట్టుబడితో ఏపీ ప్రగతి పథంలో మరో ముందడుగు వేయనుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ పెట్టుబడి ద్వారా ప్రధానంగా పునరుత్పాదక ఇంధనం, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజ్, సోలార్ తయారీ, ఇతర డీకార్బనైజేషన్ కార్యక్రమాలపై దృష్టి సారించనున్నట్టు లోకేశ్ తన ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు డేటా సెంటర్లు, వాణిజ్య రియల్ ఎస్టేట్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ), మౌలిక సదుపాయాలు, పోర్టుల వంటి విభిన్న రంగాల్లోనూ బ్...