India, Oct. 25 -- తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా తుపాను ప్రభావం కనిపించనుంది. తీర ప్రాంతంలోని విద్యా సంస్థలకు 28, 29వ తేదీల్లో సెలవులు ప్రకటించాలని వాతావరణ శాఖ సూచించింది. తీర ప్రాంత ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఈ తుపాను కాకినాడ సమీపంలోని మచిలీపట్నం, కళింగపట్నం మధ్య దాటుతుందని, గాలుల వేగం గంటకు 90-100 కి.మీ.లకు చేరుకుంటుందని ఐఎండీ తెలిపింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఇప్పటికే తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ప్రారంభమయ్యాయి. రాబోయే ఐదారు రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. అక్టోబర్ 27, 28 తేదీలలో రాయలసీమలో అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చ...