భారతదేశం, సెప్టెంబర్ 7 -- ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర సంస్థ రానుంది. ఏపీకి ఎప్పటికప్పుడు వివిధ రకాలుగా సహయం అందిస్తున్న కేంద్రం.. తాజాగా మరో సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా రీజనల్ సెంటర్‌ ఇక్కడకు రానుంది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన 4వ అంతర్జాతీయ లఘు చిత్రోత్సవాన్ని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి శనివారం ప్రారంభించారు కందుల దుర్గేష్. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రముఖంగా ప్రస్తావించారు.

నవంబర్‌లో రాజమహేంద్రవరంలో నంది నాటకోత్సవం జరగనుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సినిమా ...