భారతదేశం, జూలై 21 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు రాబోయే ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) సోమవారం హెచ్చరించింది. జూలై 21 నుంచి జూలై 27 వరకు ఈ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ స్పష్టం చేసింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌ (SCAP)లో జూలై 21న భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉరుములు, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

అమరావతిలోని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌ (NCAP), యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌ (SCAP), రాయలసీమలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వాతావరణ అంచనా కాలంలో నాలుగు ప్రాంతాల్లోనూ గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో ఈ...