భారతదేశం, సెప్టెంబర్ 17 -- ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్‌ఎస్‌డీసీ), రష్యన్ యూనియన్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (ఆర్‌ఎస్‌పీపీ) సహకారంతో ప్రతిష్టాత్మకమైన పెర్వౌరల్స్క్ మెటలర్జికల్ కళాశాలలో మెటలర్జీ(లోహశాస్త్రం)లో డిప్లొమా కోసం పూర్తి నిధులతో కూడిన స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి. మనోహర్ ఈ కార్యక్రమం ప్రయోజనాలను వివరించారు. ఇందులో మూడున్నర సంవత్సరాల పూర్తి సమయం క్యాంపస్ కోర్సుకు పూర్తి ట్యూషన్ ఫీజు కవరేజ్, ఉచిత వసతి ఉన్నాయి. ఏపీలోని ప్రతిభావంతులైన యువతకు అంతర్జాతీయంగా వేదికను అందించడం, అధునాతన సాంకేతిక శిక్షణను ఇది అందిస్తుందని చెప్పారు.

'ప్రత్యేకమైన పరిశ్రమలలో ప్రపంచస్థాయి కెరీర్ మార్గాలను సృష్టించడానికి, అధునాతన సాంకేతిక రంగాలలో విద్యార...