భారతదేశం, డిసెంబర్ 25 -- ఏపీఎస్ఆర్టీసీ ఇటీవల అనేక పర్యాటక ప్యాకేజీలను రన్ చేస్తోంది. శబరిమల, అరుణాచలంలాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు బస్సులను నడుపుతున్న విషయం తెలిసిందే. ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. టెంపుల్ టూరిజంలో భాగంగా అనే ప్యాకేజీలను నడుపుతోంది. కొత్త రూట్లలోనూ పర్యాటకులను తీసుకెళ్తోంది. భక్తులను ఆధ్యాత్మికత అనుభూతిని కలిగిస్తుంది. తాజాగా కర్ణాటక-మైసూరు, కాశీ-అయోధ్య పేరుతో టూర్ ప్యాకేజీలను తెచ్చింది ఆర్టీసీ. ఆ వివరాలు చూద్దాం..

ఈ రెండు ప్యాకేజీలు మరికొన్ని రోజుల్లో మెుదలుకానున్నాయి. జనవరి 20వ తేదీన కర్ణాటక-మైసూరు, ఫిబ్రవరి 7న కాశీ-అయోధ్య యాత్రకు వెళ్లవచ్చు. ఈ బస్సులు రాజమహేంద్రవరం నుంచి బయలుదేరుతాయి. సాయంత్రం 4 గంటలకు ప్రయాణం మెుదలుకానుంది. ఇందుకోసం సూపర్ లగ్జరీ ప్రత్యేక బస్సులను ఉపయోగిస్తోంది ఏపీఎస్ఆర్...