భారతదేశం, జనవరి 28 -- ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీలో కొలువుల జాతర మెుదలుకానుంది. పెద్ద ఎత్తున ఏపీఎస్ఆర్టీసీలో రిక్రూట్‌మెంట్ జరగనుంది. ఈ మేరకు కసరత్తు జరుగుతోంది. ఆర్టీసీలో ఖాళీలపై ప్రభుత్వానికి నివేదిక అందింది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆర్టీసీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించిన అనుమతి రాగానే రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మెుదలుకానుంది. అంతేకాదు ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల్లో కొందరికి జీతాలు కూడా పెరగనున్నాయి.

ఏపీఎస్ఆర్టీసీ మెుత్తం 7673 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయించింది. ఇందులో 3673 మంది డ్రైవర్ల్ పోస్టులు ఉన్నాయి. 1813మంది కండక్టర్లు, ఆ తర్వాత మెకానిక్, శ్రామిక్‌తోపాటుగా ఇతర ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నారు. ఆయా ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వాన్ని ఆర్టీసీ అనుమతి కోరింది. త్వరలోనే ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్ర...