భారతదేశం, మే 14 -- ఏపీ, తెలంగాణను ఎండలు, వానలు కుమ్మేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరువలో నమోదు అవుతున్నాయి. రేపు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వడగాలులు, పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు, వర్షాలు ప్రజలను అల్లాడిస్తున్నాయి. వడగాలుల ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే...అకాల వర్షాలతో రైతన్న ఆందోళన చెందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో గురువారం అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

అలాగే ర...