Telangana,andhrapradesh, జూలై 23 -- ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన మూడు నాలుగు రోజులుగా అయితే భారీస్థాయిలోనే పడుతున్నాయి. ద్రోణి ప్రభావంతో. మరో రెండు మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ హెచ్చరికలను జారీ చేసింది. మరోవైపు ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దవుతోంది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులిటెన్ ప్రకారం... ఇవాళ రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, మలుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లా...