Andhrapradesh, జూలై 19 -- తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ మరోసారి హెచ్చరికలను జారీ చేసింది. మరో రెండు మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఏపీలో మరో మూడు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇవాళ(జూలై 19) శ్రీకాకుళం,విజయనగరం, మన్యం,ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల, పల్నాడు,ప్రకాశం,నెల్లూరు,కర్నూలు, నంద్యాల, అనంతపురం,శ్రీ సత్యసాయి, వైఎస్సార్,అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. విశాఖ,అనకాపల్లి, కాకినాడ,ఏలూరు,కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాట...