భారతదేశం, డిసెంబర్ 13 -- రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్టు తెలిపింది. మార్పు చేసిన టైమింగ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

రైల్వేశాఖ నిర్ణయంతో విశాఖపట్నం - లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12805/12806) రైళ్ల ప్రయాణ వేళలు మారనున్నాయి. విశాఖపట్నం-లింగంపల్లి (ట్రైన్ నెంబర్ 12806) రైలు విశాఖపట్నంలో ఉదయం 6.20కి బయల్దేరనుంది. ఈ ట్రైన్ లింగంపల్లికి రాత్రి 7.15కి చేరుకుంటుంది.ఇక లింగంపల్లి-విశాఖపట్నం(ట్రైన్ నెంబర్ 12805) రైలు ఉదయం 6.55కు లింగంపల్లి నుంచి బయల్దేరుతుంది. రాత్రి 7.50కి విశాఖపట్నంకు చేరుకుంటుంది.

ఈ ట్రైన్ విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచలి, తుని, అన్నవ...