భారతదేశం, డిసెంబర్ 18 -- ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. మచిలీపట్నం, తిరుపతి నుంచి హైదరాబాద్ సిటీకి వన్ వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు తిరుపతి నుంచి కాచిగూడకు, మచిలీపట్నం నుంచి ఉమ్డానగర్‌కు మధ్య నడవనున్నాయి.

మచిలీపట్నం - ఉమ్డానగర్ మధ్య ప్రత్యేక రైలు (07297 నెంబర్‌) ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఇది ఈనెల 18వ తేదీన రాత్రి 9.15 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరుతుంది. మరునాడు ఉదయం 9.45 గంటలకు ఉమ్డానగర్ కు చేరుకుంటుంది.

ఈ స్పెషల్ ట్రైన్.. గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మల్కాజిగిరి, కాచిగూడ స్టేషన్ల మీదుగా ఉమ్డానగర్‌ స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లుంటాయి.

ఇక తిరుపతి - కాచిగూడ మధ్య ప్రత్యేక రైలు (07296 నెంబర...