భారతదేశం, డిసెంబర్ 14 -- సంక్రాంతి పండగ సమీపిస్తున్న వేళ దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది.తెలుగు రాష్ట్రాల మధ్య అదనంగా 41 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ రైళ్లకు సంబంధించిన ముందస్తు రిజర్వేషన్లు నేటి నుంచే ప్రారంభవుతాయి.

మరోవైపు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. క్రిస్మస్‌తోపాటు కొత్త సంవత్సరం సందర్భంగా ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు ఏపీ, తెలంగాణ మీదుగా నడుస్తాయి.

చర్లపల్లి నుంచి కాకినాడ మధ్య (ట్రైన్ నంబర్ 07196) స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి.డిసెంబర్ 24 నుంచి జనవరి 30వ తేదీ వరకు బుధ, మంగళవారాల్లో రాత్రి 7.30 గంటలకు చర్లపల్లి నుంచి ట్రైన్ బయల్దేరుతుంది. మరుసటిరోజు ఉదయం 9 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.ఇక కాకినాడ నుంచి చర్లపల్లికి(07195) డిసెంబరు 28 నుంచ...