భారతదేశం, నవంబర్ 8 -- శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతోంది. సంక్రాంతి వరకు శబరిమలకు వెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల నుంచి ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.

చర్లపల్లి - కొల్లం-చర్లపల్లి (07107/07108) మధ్య 20 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. 07107 రైలు నవంబర్‌ 17, 24, డిసెంబర్‌ 1, 8, 15, 22, 29, జనవరి 5, 12, 19 తేదీల్లో (సోమవారం) చర్లపల్లిలో మధ్యాహ్నం 12గంటలకు బయల్దేరుతుంది. మరునాడు రాత్రి 10గంటలకు కొల్లం చేరుకుంటుంది. ఇక 07108 ట్రైన్ నవంబర్‌.. 19, 26, డిసెంబర్‌ 3, 10, 17, 24, 31, జనవరి 7, 14, 21 తేదీల్లో (బుధవారం) తెల్లవారుజామున 2.30గంటలకు కొల్లంలో బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10.30గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు.నల్...