భారతదేశం, డిసెంబర్ 8 -- ఏపీలోని కొన్ని ప్రాంతాలు చలి గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతున్నాయి. చలి పరిస్థితుల మధ్య అల్లూరి సీతారామ రాజు జిల్లా ఏజెన్సీలో ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతోంది. ఈ తగ్గుదల ఈ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనేక మండలాల్లో ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి.

జనాలు విపరీతమైన చలి కారణంగా ఎక్కువగా ఇళ్లలోనే ఉండిపోతున్నారు. మంటలకు దగ్గరగా ఉంటున్నారు. ఏఎస్ఆర్ జిల్లాలోని అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేసింది. ఉదయంపూట ఎటు వెళ్లలేని పరిస్థితి. పొగమంచుతో దారులు సరిగా కనిపించడం లేదు. ఆదివారం జి మాడుగులలో 5.3 డిగ్రీల సెల్సియస్, ముంచింగిపుట్టులో 7.7 డిగ్రీలు, అరకు వ్యాలీలో 8.9, లంబసింగిలో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చింతపల్లె వద్ద 9.5 డిగ్రీలుగా నమోదైంది. శనివారం రాత్రి,...