భారతదేశం, డిసెంబర్ 22 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతున్నాయి. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు పడిపోనున్నాయి. రాష్ట్రంలో వచ్చే 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాఖ చెప్పింది. ఏపీలో కోస్తా, రాయలసీమ, యానంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల తక్కువగా నమోదుకానున్నాయి.

అల్లూరి, పార్వతీపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 12 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు‌ నమోదవుతున్నాయి. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అరకు, పాడేరు, చింతపల్లిలో 4 నుంచి 7 డిగ్రీల మధ్యలోనే ఉంటున్నాయి.

ఇక తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్‌లో నమోదైంది. చలిగాలుల ప్రభావం ఇంకా కొనస...