భారతదేశం, ఏప్రిల్ 26 -- తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ పక్క ఎండలు మండిపోతుంటే మరో వైపు మబ్బులు రైతులను భయపెడుతున్నాయి. ఆదివారం ఏపీ, తెలంగాణలోని వాతావరణ పరిస్థితులపై స్థానిక వాతావరణ కేంద్రాల రిపోర్ట్ ఇలా ఉంది.

ఆదివారం అల్లూరి జిల్లా కూనవరం, కాకినాడ జిల్లా జగ్గంపేట, కిర్లంపూడి, ఏలేశ్వరం మండలాల్లో తీవ్రవడగాలులు, 17 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇవాళ వైఎస్సార్ జిల్లా సిద్ధవటంలో42.5degC, నంద్యాల జిల్లా గోస్పాడులో42.2degC, 95 ప్రాంతాల్లో40degCకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు తెలిపారు. అ...