భారతదేశం, మే 26 -- నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. రాబోయే మూడు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతుదని.. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

ద్రోణి కారణంగా.. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఐఎండీ స్పష్టం చేసింది. మే నెల 27వ తేదీకి ఒకరోజు అటుఇటుగా.. తెలంగాణను రుతుపవనాలు తాకనున్నాయని.. వాతావరణ విభాగం నిపుణులు అంచనా వేశారు. ఆ అంచనాల ప్రకారం రుతుపవనాలు వచ్చాయి. ఇవి వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. ...