భారతదేశం, నవంబర్ 23 -- కొద్ది రోజులుగా ఏపీని తుపాన్‌ భయం వెంటాడుతోంది. మొంథా తుపాను రాష్ట్రంలో బీభత్సం సృష్టించింది. అయితే మరో తుపాను సెనియార్ కూడా ఉంటుందని మెుదట అంచనా వేశారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను ఏపీ వైపు కాకుండా పశ్చిమ బెంగాల్/బంగ్లాదేశ్ వైపు మళ్లే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

దక్షిణ అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. బుధవారం నాటికి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 26 నుంచి ఎక్కువ వర్షాలు కురవనున్నాయి. తుపాను పశ్చిమ బెంగాల్/బంగ్లాదేశ్ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది.

దీని ప్రభావంతో ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని పలు జిల్లాలను ఐఎండీ అప్రమత్తం చేసి...