Telangana,andhrapradesh, ఏప్రిల్ 16 -- కొద్దిరోజులుగా ఏపీ, తెలంగాణలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు ఎండ తీవ్రత కనిపిస్తుండగా. మరికొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడినట్లు ఉంటుంది. కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఇదే పరిస్థితి మరో రెండు మూడు రోజుల పాటు ఉండే అవకాశం ఉంది.

బీహర్ నుంచి ఉత్తర తీర ప్రాంత ఏపీ వరకు ఉన్న ద్రోణి ప్రస్తుతం... సిక్కిం నుంచి ఉత్తర ఒడిశా వరకు జార్ఖండ్ మీదుగా సగటు సముద్రమట్టానికి 3.1 కిమీ ఎత్తులో కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అంతర్గత కర్ణాట, రాయలసీమ, తమిళనాడు మీదుగా మరో ద్రోణి కూడా విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. నైరుతి బంగాళాఖాతం అనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం ఇవాళ బలహీన పడినట్లు వెల్లడించింది.

తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిస...