Hyderabad,telangana,andhrapradesh, జూలై 17 -- ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఈ రెండు రోజులపాటు కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం... ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చు. అయితే నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఇక ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వి...