Andhrapradesh, సెప్టెంబర్ 18 -- ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరాలను పేర్కొంది. రాబోయే 3 గంటల్లో కాకినాడ, కోనసీమ, ప్రకాశం,నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఇక కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు జిల్లాల్లో మేఘావృతమై అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని సూచించింది.

ద్రోణి ప్రభావంతో రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు పడే అవకాశం...