Telangana,hyderabad,andhrapradesh, ఆగస్టు 12 -- ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇక బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో. మరిన్ని వర్షాలు పడనున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా(ఆగస్ట్ 12) బులెటిన్ తెలంగాణలో ఇావాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

రేపు (ఆగస్ట్ 13) కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లా...