భారతదేశం, ఆగస్టు 12 -- న్యూఢిల్లీ: దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో నాలుగు చిప్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల కోసం మొత్తం రూ. 4,594 కోట్ల పెట్టుబడులు రానున్నాయి.

దేశంలో చిప్ తయారీకి ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన ఇండియా సెమీకండక్టర్ మిషన్ (India Semiconductor Mission) కింద ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ మిషన్ కోసం ప్రభుత్వం రూ. 76,000 కోట్లను కేటాయించింది.

కేంద్ర మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ, "ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లలో నాలుగు సెమీకండక్టర్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది" అని చెప్పారు. ఈ ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి...