భారతదేశం, జనవరి 15 -- క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మించిన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ 'కట్టాలన్' సెకండ్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఫస్ట్ లుక్ తర్వాత, రెండవ లుక్‌ మరింతగా ఆశ్చర్యపరిచేలా రూపొందించారు. ఈ సినిమాలో సునీల్ కీలక పాత్ర పోషించడం విశేషం.

ఏనుగుల వేట నుంచి ప్రేరణ పొందిన ఉత్కంఠభరితమైన మాస్ యాక్షన్‌ను సూచిస్తూ, ఈ పోస్టర్ మలయాళ సినిమా చరిత్రలో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో ఆంటోనీ వర్గీస్‌ను పరిచయం చేసింది. కట్టలన్ సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే, ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌లోనూ, తాజాగా విడుదలైన సెకండ్ లుక్‌లోనూ పవర్ ఫుల్ లుక్‌లో చూపించారు.

మలయాళ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా 'కట్టాలన్' మే 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడ...