భారతదేశం, డిసెంబర్ 20 -- అసోంలోని నాగావ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున రైలు ప్రమాదం జరిగింది. కాంపూర్ ప్రాంతంలో సాయిరంగ్ - దిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏనుగుల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది అడవి ఏనుగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి! ఒక మూగజీవానికి గాయాలయ్యాయి. ప్రమాద ప్రభావం ఎక్కువగా ఉండటంతో రైలు ఇంజిన్‌తో పాటు ఐదు బోగీలు కూడా పట్టాలు తప్పాయని అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనపై ఈశాన్య సరిహద్దు రైల్వే (ఎన్​ఎఫ్​ఆర్​) అధికారులు స్పందించారు. లమ్డింగ్ డివిజన్ పరిధిలోని జమునాముఖ్ - కాంపూర్ సెక్షన్ మధ్య శనివారం తెల్లవారుజామున 2.17 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

ఎనిమిది ఏనుగుల మరణ వార్త బాధకారంగా ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో రైలులోని ప్రయాణికులెవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే డివిజనల్ హెడ్ క్వార్టర్స...