Hyderabad, అక్టోబర్ 8 -- భారతీయ సంప్రదాయం ప్రకారం కొన్ని జంతువులు ధనం, శక్తి వంటి వాటిని తీసుకొస్తాయి. వాస్తు ప్రకారం ఈ జంతువులు ఇంట్లో ఉండడం వలన అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి, సానుకూల శక్తి ప్రవహిస్తుంది, డబ్బుకి లోటు ఉండదు, ప్రశాంతత ఉంటుంది. అదే విధంగా ఇంట్లో కానీ, పని ప్రదేశంలో కానీ ఈ జంతువులు ఉంటే పురోగతిని చూస్తారు.

ఏనుగు, చేప, గుర్రం, తాబేలు ఇలా చాలా రకాల జంతువులు మనకి సానుకూల ఫలితాలను తీసుకొస్తాయి. మరి ఏ జంతువులు ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుంది, సానుకూల శక్తి వ్యాపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏనుగుని చాలా శుభ జంతువుగా భావిస్తారు. వాస్తు ప్రకారం ఏనుగు ఫోటో లేదా విగ్రహం వంటివి ఇంట్లో ఉన్నట్లయితే శక్తి కలుగుతుంది, అదృష్టం కూడా కలిసి వస్తుంది. ప్రతికూల శక్తి ఆ ఇంటి నుంచి తొలగిపోతుంది. విపరీతమైన అదృష్టం కలగాలంటే వెండి లేదా కాంస్...