భారతదేశం, నవంబర్ 11 -- కింగ్ నాగార్జున ఆల్ టైం కల్ట్ క్లాసిక్ 'శివ' బాక్సాఫీసు రికార్డులుని తిరగరాస్తూ ఇండియన్ సినిమాను మార్చేసింది. 'బిఫోర్ శివ', 'ఆఫ్టర్ శివ' అన్నట్లుగా రీడిఫైన్ చేసింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మాతలు అక్కినేని వెంకట్, సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు.

అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా శివ చిత్రాన్ని 4K డాల్బీ ఆట్మాస్‌లో నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా శివ స్పెషల్ ప్రిమియర్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో కింగ్ నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

-సౌండ్ క్యాలిటీ ఎన్హెన్స్ అయ్యిందని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఒరిజినల్‌లో ఉండే ఫ్లేవర్ పోకుండా ఏఐ టెక్నాలజీని వా...