Hyderabad, సెప్టెంబర్ 24 -- సల్మాన్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పిల్లలను కనడంపై అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో గురువారం (సెప్టెంబర్ 25) నుంచి ప్రారంభం కానున్న కాజోల్, ట్వింకిల్ ఖన్నా షో టూ మచ్ (Two Much)లో ఆమిర్ ఖాన్ తో కలిసి పార్టిసిపేట్ చేసిన అతడు.. గతంలోని తన సంబంధాలపై స్పందించాడు. అటు ఆమిర్ ఖాన్ కూడా రీనాతో విడాకుల విషయంపై మాట్లాడాడు.

సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్.. బాలీవుడ్ లో ఇద్దరు సూపర్ స్టార్లు. ఎన్నో హిట్ సినిమాలు అందించారు. అలాంటి ఇద్దరే ఒకే షోకి వచ్చి తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ తాజా ఎపిసోడ్‌లో తాను సల్మాన్ విషయంలో మొదట్లో చాలా జడ్జ్‌మెంటల్‌గా ఉండేవాడినని, కానీ రీనా దత్తాతో విడాకులు తీసుకున్నప్పుడు అతనితో దగ్గరైనట్లు ఆమిర్ చెప్పాడు. ఈ ఇద్దరూ 'అందాజ్ అప్నా అప్నా' (1994) సినిమాలో కలిసి పని ...