Hyderabad, జూన్ 11 -- థియేటర్లలో గతేడాది నవంబర్లో రిలీజ్ అయిన కన్నడ రివేంజ్ థ్రిల్లర్ మూవీ మర్యాదే ప్రశ్నే (Maryade Prashne). ఈ సినిమా గతంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే ఏడు నెలల తర్వాత ఇప్పుడు సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీలోకి కూడా రాబోతోంది. ఆ వివరాలేంటో చూడండి.

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో రివేంజ్ థ్రిల్లర్ మూవీ మర్యాదే ప్రశ్నే. అంటే ఇది గౌరవానికి సంబంధించిన ప్రశ్న అని అర్థం. ఈ సినిమా గతేడాది నవంబర్ 22న థియేటర్లలో రిలీజై ఓ మోస్తరు రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ప్రైమ్ వీడియోలోనూ స్ట్రీమింగ్ కు వచ్చింది.

అయితే ఇన్ని రోజుల తర్వాత ఈ మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలోకి కూడా అడుగుపెడుతోంది. "తీర్పు వచ్చేసింది. గౌరవానికి సంబంధించిన ప్రశ్నగా మొదలై నిజం కోసం సాగే పోరాటంగా మారింది. మర్యాదే ప్రశ్నే జూన్ 13 నుంచి ...