భారతదేశం, జనవరి 8 -- తెలుగు టీవీ సీరియల్స్ 52వ వారం టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. వీటిలో ఎప్పటిలాగే కార్తీక దీపం 2 సీరియల్ హవా కొనసాగింది. మొత్తంగా టాప్ 10లో ఏడు స్టార్ మా, మూడు జీ తెలుగు సీరియల్స్ చోటు సంపాదించాయి. స్టార్ మాలో వచ్చిన కొత్త సీరియల్ పొదరిల్లు.. వరుసగా మూడో వారం కూడా టాప్ 10లోనే నిలవడం విశేషం.

2025 మొత్తం తెలుగులో స్టార్ మా సీరియల్స్ హవానే కొనసాగిన విషయం తెలుసు కదా. చివరి వారం కూడా అదే జరిగింది. టాప్ 10లో ఏడు ఈ ఛానెల్ కు చెందిన సీరియల్సే ఉన్నాయి. వీటిలోనూ కార్తీక దీపం 2 సీరియల్ 14.94 రేటింగ్ తో తొలి స్థానంతో ఏడాదిని ముగించింది. 2025లో మధ్యలో కొన్ని వారాలు తప్ప ఏడాది మొత్తంగా ఈ సీరియలే టాప్ లో ఉంటూ వచ్చింది. కొన్నాళ్లు ఇల్లు ఇల్లాలు పిల్లలు టాప్ లోకి దూసుకెళ్లినా.. మళ్లీ కార్తీక దీపం 2 తన స్థానాన్ని అందుకుంది.

ఇల్లు ఇల...