భారతదేశం, ఆగస్టు 2 -- పాన్ ఇండియా మూవీగా రిలీజై బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డ మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. థియేటర్లో రిలీజైన ఏడాది తర్వాత 'నడికర్' (nadikar) మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ మూవీని తెలుగులో 'నడిగర్'గా రిలీజ్ చేశారు. ఓ స్టార్ హీరో జీవితంలోని కష్టాలను ఈ మూవీలో ఫన్నీగా చూపించారు. కానీ అది ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా ఈ మూవీ నిలిచింది.

నడికర్ సినిమా 2024 మే 3న పాన్ ఇండియా లెవల్ లో రిలీజైంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదలైంది. కానీ రూ.40 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ మలయాళ కామెడీ డ్రామా బాక్సాఫీస్ దగ్గర రూ.5.39 కోట్లు మాత్రమే రాబట్టింది. థియేటర్లలో ఈ మూవీ ఆడియన్స్ ను డిసప్పాయింట్ చేసింది.

నడికర్ మూవీ గతంలోనే ...